చంద్రబాబుకు కన్నా మంచి స్నేహితుడు..

22 Apr, 2020 12:58 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: మహమ్మారి కరోనా(కోవిడ్‌-19)ను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా అన్నారు. కరోనాపై పోరులో ప్రభుత్వం సమర్థవంతగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా.. టీడీపీ నేతలు ముక్కును నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దున్న ఈనిందంటే దూడని కట్టండని గావు కేక పెట్టినట్టుగా ప్రతిపక్షాల తీరు ఉందని ధ్వజమెత్తారు. కరోనా కిట్ల కొనుగోలు అంశంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్లు పెట్టడమేమిటని ప్రశ్నించారు. బుధవారమిక్కడ మాట్లాడిన దాడిశెట్టి రాజా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.(ఒక్కో టెస్టింగ్‌ కిట్‌ రూ.795; ఆ నోళ్లకు తాళం!)

‘‘తనకు డౌట్ వచ్చి ట్వీట్ పెట్టానని కన్నా చెప్పినప్పుడు టీడీపీ ఎల్లో గ్యాంగ్ ఎందుకు మౌనంగా ఉంది. చంద్రబాబు నాయడు రంగాను హత్య చేశాడు... నన్ను కూడా హత్య చేస్తాడని చెప్పిన మాటలు కన్నాకు ఇప్పుడు గుర్తులేవా. చంద్రబాబు దగ్గర చందాలు తీసుకుని కన్న విమర్శలు చేస్తున్నారు. సంస్కారం లేని చంద్రబాబు కన్నాకు మంచి మిత్రుడు అయిపోయాడు. ఆకాశం మీద ఉమ్మివేస్తే ఏం జరుగుతుందో... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అదే జరుగుతుంది’’ అని కన్నా తీరును ఎండగట్టారు. చంద్రబాబు అసలు మనిషేనా.. ఆయనకు కొంచమైనా మానవత్వం ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ళ టీడీపీ పాలనలో నీరు- చెట్టు నుంచి పోలవరం ప్రాజెక్టు దాకా రూ.6 లక్ణల కోట్లు దోచేసి... పార్టీ శవాలపై పేలాలు ఏరుకుందని దుయ్యబట్టారు.(ఆయన దారుణ వ్యక్తిత్వం మరోసారి రుజువైంది: సజ్జల)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా