తలసానిని కలసిన దానం నాగేందర్‌

22 Jun, 2018 19:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దానం నాగేందర్‌ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరికపై దానం నాగేందర్‌ తలసానితో చర్చించారు. భేటీ అనంతరం మాట్లాడుతూ పార్టీలోకి ఎవరు వచ్చిన సాదరంగా ఆహ్వానిస్తామని తలసాని అన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్‌ చేసి చూపించారన్నారు.

మరోవైపు దానం నాగేందర్‌ బాటలో మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ కూడా నడుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీనియర్‌ నేత జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. దానం నాగేందర్‌ పార్టీని విడటంపై చర్చించారు. అంతకుముందు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దానం నాగేందర్‌ను బుజ్జగించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు.

సంపత్‌కుమార్‌కు పదవి ఇవ్వడంపై దానం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నికల సమయంలో కీలక నేతలు పార్టీని వీడటం వల్ల బలహీనమవుతామని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి ముఖేశ్‌, విక్రమ్‌లు కూడా పార్టీని వీడతారనే వార్త వారిలో మరింత గుబులు పుట్టిస్తోంది.

మరిన్ని వార్తలు