‘జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగితే గయ్యిమని ఎగవడకు’

5 May, 2020 11:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇవాళ్టి ప్రెస్‌మీట్‌లో అయినా నిజం చెప్పాలని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఎంపీ ధర్మపురి అరవింద్‌ ధ్వజమెత్తారు. వలస కార్మికుల భోజనం, ఇతర సౌకర్యాల కోసం కేంద్రం ఇచ్చిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు, రూ.599 కోట్లను ఏo చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. 

కరోనా ఆసుపత్రుల అభివృద్ధికి, వైద్యపరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15000 కోట్లు విడుదల చేసిందని  ధర్మపురి అరవింద్‌ తెలిపారు. అందులో మన రాష్ట్రానికి ఎంత వచ్చింది, ఎన్ని పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు కొన్నారు? అని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. 15వ ఫైనాన్స్ కమిషన్ రూ.982 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిందన్నారు. కార్డు హోల్డర్స్ కి మీరిచ్చిన రూ.1500, ఈ నిధుల నుండే మళ్లించారు కదా అని మండిపడ్డారు. మీడియా సమావేశంలో జర్నలిస్ట్ ఎవరైనా ఈ ప్రశ్నలు అడిగితే, గయ్యిమని ఎగవడకు!!! అంటూ ఎద్దేవా చేశారు.(తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు)

మరిన్ని వార్తలు