టీఆర్‌ఎస్, పోలీసుల కుట్ర ర్యాలీకి అనుమతి నిరాకరణపై దాసోజు

31 Dec, 2019 05:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రతిష్ట పెరుగుతుందనే భయంతో టీఆర్‌ఎస్‌ పార్టీ, పోలీసులు కుట్రపూరితంగా ర్యాలీకి అనుమతి వ్వలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ధ్వజమెత్తారు. గాంధీభవన్‌కి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేయడం అన్యాయమన్నారు. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్, ప్రేమ్‌లాల్‌లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు.

నగర సీపీని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఒకమాట అనగానే తలసాని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన తన నోటిని అదుపు లో పెట్టుకోవాలన్నారు. టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్త మ్‌ ఫోన్‌ చేస్తే సీపీ అమర్యాదకరంగా మాట్లాడారని తెలిపారు. దానిని దృష్టిలో పెట్టుకుని సభలో ఉత్తమ్‌ మాట్లాడారని, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవ్యక్తిగా మారిన తలసాని స్పందించడం ఏంటన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను ఎవరూ తిట్టనంతగా తలసాని తిట్టారని, ఉద్యమం సందర్భంగా తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి అని విమర్శించారు. ఐపీఎస్‌లు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలని, కానీ వారు టీఆర్‌ఎస్‌కు గులాంలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దీపంతో మహమ్మారిని ఎలా ఆపుతారు?

టార్చిలైట్లు వేసినంత మాత్రాన..

'బాబు.. నీ బోడి సలహాలు అవసరం లేదు'

ముందుచూపు లేని మోదీ సర్కారు

ఏడాది కింద కరోనా వచ్చుంటేనా..

సినిమా

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు