మంత్రిపై చర్యలేవి; ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాసోజు

16 Apr, 2018 19:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రైవేటు భూముల కొనుగోలు వ్యవహారంలో మంత్రి జగదీశ్‌రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ తప్పుబట్టారు. మంత్రి ప్రైవేటు భూములను కొనుగోలు చేసి.. ప్రభుత్వానికి ఎక్కువ ధరకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గతంలో మీడియాలో వచ్చిన వార్తలను ఆయన గుర్తుచేశారు. ఇది జరిగి మూడు రోజులైనా.. సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని శ్రవణ్‌ విమర్శించారు. సాక్ష్యాలతో సహా మాట్లాడినా మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ నిలదీశారు. 

ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చాలని చూస్తోందని ఆరోపించారు. ఈవిషయాన్ని చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫ్‌ ఇండియా, లోకాయుక్త దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సైదు రెడ్డి​కి హుజూర్‌ నగర్‌ సీటు.. మంత్రి జగదీశ్వర్‌ రెడ్డికి డబ్బులు అన్న చందాన క్విడ్‌ప్రో కో జరుగుతోందని ఆరోపించారు. అన్ని అంశాలపై ట్విటర్‌లో స్పందించే మంత్రి కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు