‘అభిప్రాయం తీసుకున్న తర్వాతే విభజన నిర్ణయం’

20 Feb, 2018 11:56 IST|Sakshi
మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు

విజయవాడ : నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాతే విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు వ్యాఖ్యానించారు. విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో పల్లం రాజు విలేకరులతో మాట్లాడారు. నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వ వాగ్ధానాన్ని నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై కొన్ని నెలల క్రితం నుంచే చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారని అన్నారు.

కేంద్ర ఇచ్చిన నిధులు, చేసిన ఖర్చుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు. సోనియాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా లేఖలో ఆంధ్ర్ర ప్రదేశ్‌కు కేటాయించవలసిన నిధులు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరారని చెప్పారు. మార్చ్ 2న ఏపీలో రాస్తారోకో నిర్వహిస్తామని, అనంతరం ఢిల్లీలో మార్చి 7, 8వ తేదీల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రానికి న్యాయం జరిగే విధముగా ప్రభుత్వాలు కనీస ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరారు.

మరిన్ని వార్తలు