క్షీణిస్తున్న యువ ఎంపీల ఆరోగ్యం

11 Apr, 2018 01:35 IST|Sakshi
ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి

     నీరసం ఆవహిస్తున్నా మొక్కవోని దీక్ష

     వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరామర్శించిన జగన్‌

     ఐదుగురు ఎంపీలు రాష్ట్రం గర్వపడేలా చేశారన్న జననేత

     ఆందోళనకరంగా బీపీ, చక్కెర స్థాయిలు

     దీక్షలకు వెల్లువెత్తుతున్న సంఘీభావం

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ప్రత్యేక హోదా–ఆంధ్రుల హక్కు’ అని నినదిస్తూ పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు హోరెత్తేలా చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీల ఆమరణ దీక్షలు మంగళవారం ఐదో రోజుకు చేరాయి. ఐదుగురు ఎంపీల్లో ముగ్గురి ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఇప్పటికే బల వంతంగా ఆసుపత్రికి తరలించారు. యువ ఎంపీలైన పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డిలు హోదా కలను సాకారం చేసేందుకు పట్టుదలతో దీక్షను ముందుకు తీసుకెళ్తున్నా రు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని రామ్‌మనోహర్‌ లోహియా (ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

ఇదే సమయంలో గుంటూరు జిల్లా పాదయాత్రలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీరితో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘మీ దీక్ష మాకు స్ఫూర్తి. ఆమరణ దీక్షకు దిగడాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారు.. మీ ఐదుగురి దీక్షను చూసి రాష్ట్రం గర్వపడుతోంది.. మీ పోరాటాన్ని ఏపీ ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారు. మిమ్మల్ని చూసి గర్విస్తు న్నాను’ అని జగన్‌ వారిని ఉత్తేజపరిచారు.  కాగా,  పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డిలను కూడా నీరసం బాగా ఆవహించిన ప్పటికీ పట్టు వీడకుండా దీక్ష కొనసాగిస్తున్నా రు. వీరిద్దరి ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిన్న దని, రక్తంలో చక్కెరస్థాయి క్రమంగా ప్రమాదస్థాయికి పడిపోతోందని, ఇతర వైద్య పరీక్షల ఫలితాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయని వైద్యులు మంగళవారం ఉదయం నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో దీక్షా శిబిరంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. 

హోదా సాధనే మాకు ముఖ్యం
ఇదిలా ఉంటే.. ఐదు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుండడంతో యువ ఎంపీలిద్దరూ మంగళవారం నాటికి బాగా నీరసించిపో యారు. కదలడానికి కూడా ఇబ్బందిపడుతు న్నారు. గంటలు గడిచే కొద్దీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని చెబుతున్నా వీరు మరింత అకుంఠిత దీక్షతో నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు. ‘మా రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా సాధనే మాకు ముఖ్యం.. అందుకోసం దేనికైనా  సిద్ధం’ అని వారు స్పష్టం చేస్తున్నారు.

వెల్లువెత్తుతున్న సంఘీభావం
కాగా, దీక్షల ఐదో రోజున ఢిల్లీలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు వివిధ ప్రజా సంఘాల వారు వైఎస్సార్‌సీపీ ఎంపీలను పరామర్శించి తమ మద్దతును ప్రకటించారు. 

దీక్ష కొనసాగిస్తే పరిస్థితి తీవ్రం: వైద్యులు
సాక్షి, న్యూఢిల్లీ :  ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న  పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డిల ఆరోగ్యం క్షీణిస్తోంది. షుగర్‌ లెవెల్స్‌ పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్‌ఎంఎల్‌ వైద్యులు మంగళవా రం వైద్య పరీక్షలు జరిపి దీక్షలు విరమించాలని వారిని కోరారు. కాగా, వీరిద్ద రూ ఇçప్పటికే డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నా రని.. షుగర్‌ లెవెల్స్‌ అంతకంతకూ పడిపోతు న్నాయని, ఇంకా దీక్ష కొనసాగిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన వైద్య పరీక్షల్లో అవినాష్‌రెడ్డి బీపీ 110/70, షుగర్‌ లెవెల్స్‌ 74, పల్స్‌రేటు 76కు పడిపోయాయి. మిథున్‌రెడ్డి బీపీ 106/70, షుగర్‌ లెవెల్స్‌ 78, పల్స్‌రేట్‌ 86కు పడిపోయాయి.  

మరిన్ని వార్తలు