సామ్రాజ్యవాద భావజాలాన్ని అడ్డుకోవాలి

9 Jan, 2018 02:47 IST|Sakshi

విరసం నేత వరవరరావు

హైదరాబాద్‌: బ్రాహ్మణీయ, సామ్రాజ్యవాద భావజాలాన్ని అడ్డుకోవాలని విరసం నేత వరవరరావు అన్నారు. సోమవా రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విప్లవ రచయితల సంఘం (విరసం) 26వ మహాసభల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. నేరెళ్ల ఘటన, మందకృష్ణ మాదిగ అరెస్టుల నేపథ్యంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందనిపిస్తోందని అన్నారు.

రాజ్యం చేతిలో అనేకమంది విప్లవ రచయితలు, ఆదివాసీలు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. లంబాడీలు, ఆదివాసీల మధ్య పాలకులు చిచ్చు పెడుతున్నారని విమర్శిం చారు. చివరికి ప్రభుత్వ కార్యాలయాలకూ కాషాయం రంగు వేస్తున్నారన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని ప్రపంచ తెలుగు మహాసభలకు దూరం పెట్టారన్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో మహబూబ్‌నగర్‌ క్రౌన్‌ గార్డెన్‌లో జరిగే విరసం మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో విరసం సభ్యులు గీతాంజలి, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు