ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌, స్మృతి ఇరానీ ట్వీట్‌ వార్‌

8 Feb, 2020 17:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు- 2020   ముగిశాయి. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు కొనసాగాయి. సాయంత్రం 5 గంటల వరకు 44.52 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య మాటల యుద్ధం నడిచింది. మహిళా ఓటర్లకు ట్విటర్‌ వేదికగా కేజ్రీవాల్‌ చేసిన ఓ విఙ్ఞప్తిని స్మృతి తప్పుబట్టారు. పోలింగ్‌ మొదలవడానికి ముందు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో..
(చదవండి : ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌ లైవ్‌అప్‌డేట్స్‌)

‘అందరూ తప్పకుండా ఓటు వేయండి. ముఖ్యంగా మహిళా ఓటర్లందరూ కదలిరండి. మీ కుంటుంబ బాగుకోసం ఎంత శ్రద్ధ తీసుకుంటారో.. అలాగే దేశాన్ని, ఢిల్లీని మంచి నాయకుల చేతుల్లో పెట్టడానికి నడుం బిగించండి. మీ భర్త సాయం తీసుకుని ఎవరు ఢిల్లీకి సరైన నాయకుడో చర్చించి ఓటు వేయండి. ఇది నా పత్యేక వినతి’ అని ట్వీట్‌ చేశారు. కాగా, కేజ్రీవాల్‌ ట్వీట్‌పై స్పందించిన స్మృతి.. మహిళల్ని ఢిల్లీ సీఎం కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎవరికి ఓటు వేయాలనే స్వేచ్ఛ కూడా మహిళలకు లేదా అని ప్రశ్నించారు. మహిళల్ని కేజ్రీవాల్‌ తక్కువ చేసి మాట్లాడారని ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్వీట్‌ చేసిన కేజ్రీవాల్.. ఎవరికి ఓటు వేయాలో ఢిల్లీ మహిళలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. ఇక ఎన్నికల కౌంటింగ్‌ ఫిబ్రవరి 11న జరుగనుంది.
(చదవండి : కేజ్రీవాల్ ఒక్కడే..)

మరిన్ని వార్తలు