కాంగ్రెస్‌లో చేరిన ఆప్‌ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి

18 Jan, 2020 19:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎమ్మెల్యే ఆదర్శ్‌ శాస్త్రి హస్తం గూటికి చేరారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి ఆప్కి గుడ్‌బై చెప్పి, శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన... ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. శాసనసభ్యులను కలిసేందుకు కేజ్రీవాల్‌ సమయం కూడా ఇవ్వడం లేదని, నియంతగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

కేజ్రీవాల్ టికెట్ పంపిణీని వ్యాపారంగా మార్చారని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై అభిప్రాయం చెప్పమని కేజ్రీవాల్‌ను కోరగా ఆయన ముందుకు రాలేదని ఆదర్శ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చోప్రా, పిసి చాకో, ముఖేష్ శర్మ కూడా పాల్గొన్నారు. కాగా షీలా దీక్షిత్ ప్రభుత్వంలో ఆదర్శ్ శాస్త్రి మంత్రిగా పనిచేశారు. అయితే మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్‌ .... సిట్టింగ్‌ల్లో 15 మందికి టికెట్లు నిరాకరించారు. అందులో ఆదర్శ్‌ శాస్త్రి కూడా ఉన్నారు.

చదవండి:

మా నాన్నను గెలిపించండి: సీఎం కుమార్తె

ఆప్ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్

తేలని సీఎం అభ్యర్థి.. మోదీపైనే భారం!

మరిన్ని వార్తలు