సునంద పుష్కర్ కేసు.. పిల్‌ కొట్టివేత

26 Oct, 2017 15:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్‌ స్వామికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై ఆయన వేసిన పిల్‌ను గురువారం కొట్టేసింది. కేసును శశిథరూర్‌ ప్రభావితం చేస్తు‍న్నారని.. కోర్టు ఆధ్వర్యంలో సిట్‌ విచారణ జరిగేలా ఆదేశించాలంటూ స్వామి ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

అయితే స్వామి వేసిన పిటిషన్‌ ఓ రాజకీయ ప్రయోజన వ్యాజ్యంలా ఉందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది.  అయితే స్వామి ఆరోపణలకు సంబంధించి సరైన సాక్ష్యాలను సమర్పించలేకపోయాడని జస్టిస్ ముదలియర్‌, జస్టిస్‌ మెహతా నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. కోర్టుకు సమర్పించిన అంశాలను స్వామి రహస్యంగా ఉంచారని ఈ సందర్భంగా జడ్జిలు పేర్కొన్నారు. నేతలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా కేసులు వేయటం సరికాదని.. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ చాలా జాగ్రత్తగా వ్యహరిస్తుందని ధర్మాసనం పేర్కొంది. 

మరోవైపు కేసును తప్పుదోవ పట్టించేందుకు శశిథరూర్ జోక్యం చేసుకున్నారంటూ స్వామి ఆరోపణలు చేయగా.. వాటిని ఢిల్లీ పోలీసులు, కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్‌ సంజయ్ జైన్ వాటిని ఖండించారు.

మరిన్ని వార్తలు