జగనన్న పాలన చూసి బాబు వెన్నులో వణుకు 

26 Oct, 2019 03:57 IST|Sakshi
మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి  

శ్రీరంగరాజపురం(చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు నెలల పాలన చూసి చంద్రబాబునాయుడికి వెన్నులో వణుకు పుడుతోందని ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం నెళవాయి గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు.. మీ పాలనలో ప్రజా సొమ్మును దోచుకోవడంతో ప్రజలు  ప్రతిపక్ష పదవి కట్టబెట్టారు.

ఏనాడూ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదు. అదే ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విశేష రీతిలో సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న నేపథ్యంలో మీకు మనోవేదన వచి్చంది. త్వరలో మీ పార్టీ, మీ నాయకులు అడ్రస్‌ లేకుండా పోతారు. రివర్స్‌ టెండరింగ్‌తో రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వస్తే మీకు వచ్చే నష్టమేమి? నేడు రైతులకు అందించిన రైతు భరోసా, ఇండ్ల స్థలాలు పంపిణీ, వార్డు వలంటీర్ల ఎంపిక, సచివాలయ ఉద్యోగాలను మా నేత పారదర్శకంగా అమలు చేశారు’  అని అన్నారు.  బ్యాంకు మేనేజర్లు రైతుల ఖాతాలో పడిన రైతు భరోసా డబ్బును పాత అప్పులకు జమచేయడం సమంజసం కాదని నారాయణస్వామి సూచించారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు