'మందేయాలనే బాబు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో'

3 Mar, 2020 14:10 IST|Sakshi

సాక్షి, అమరావతి : మహిళల రక్షణ  కోసమని మద్యపాన నిషేధం నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. ఆ నిర్ణయమే నేరాలకు కారణంగా మారిందని టీడీపీ నేతలు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదన్నారు.మద్యం బాటిళ్లకు కమిషన్‌లు తీసుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం నిర్ణయం వల్ల రాష్ట్రంలోని మహిళలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారన్నారు. టీడీపీ పనిగట్టుకొని బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందని, సాయంత్రం పెగ్గులు వేసుకోవాలని చెప్పే చంద్రబాబు ముఖ్యమంత్రి ఎలా అయ్యారని ప్రశ్నించారు.

తాగుబోతుల సంఘం అధ్యక్షుడిగా బాబు వ్యవహరిస్తున్నారన్నారు.మద్యం రేట్లు విపరీతంగా పెరిగిపోయాయంటూ లోకేష్‌ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మద్యం బాటిళ్లు ఇంటింటికీ సరఫరా చేస్తున్నారని  గ్రామ వలంటీర్లను విమర్శిస్తున్నారు.. కానీ, నిజం చెప్పాలంటే టీడీపీ నాయకులంతా లిక్కర్‌ సిండికేట్‌లేనని మండిపడ్డారు.మద్యపానం నిషేధం ఎత్తేయాలని చంద్రబాబుకు ప్రతీ గ్రామం తిరిగే అవకాశం తాము కల్పిస్తామన్నారు. అప్పుడు ప్రజలే బాబుకు బుద్ది చెబుతారని ఎద్దేవా చేశారు. పేదవాడు పైకి వస్తే బాబు ఓర్చుకోలేడన్నారు. అందుకే ఆయన ఇలాంటి పనులు చేస్తున్నారని నారాయణస్వామి తెలిపారు. 
(‘ఎక్కడ ఇబ్బంది పెట్టావో, అక్కడే..’)

(‘అంగిట బెల్లం ఆత్మలో విషం’ ఇది బాబు నైజం)

మరిన్ని వార్తలు