నవరత్నాలతోనే అన్ని వర్గాల అభివృద్ధి

22 Sep, 2018 04:59 IST|Sakshi
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నియోజకవర్గ సమన్వయకర్త పినిపే విశ్వరూప్‌

     రాజన్న రాజ్యం తెద్దాం

     ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను సీఎంను చేద్దాం

     ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమంలో ప్రజలతో వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శుక్రవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘రావాలి జగన్‌– కావాలి జగన్‌’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ సీనియర్‌ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుని నవరత్న పథకాల గురించి వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో పలు గ్రామాల్లో పార్టీ నేతలు పర్యటించి నవరత్న పథకాలు అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూర్చుతాయని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. విజయనగరం జిల్లాలో ఇంటింటికీ నవరత్నాలు పేరిట కార్యక్రమం నిర్వహించారు. విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షంలోనూ పార్టీ నేతలు ప్రజలను కలుసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గ్రామాల్లో పార్టీ నేతలు పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చాక పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అందరం కలసి జగన్‌ను సీఎంను చేద్దామని, రాజన్న రాజ్యం తెచ్చుకుందామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి నవరత్నాల గురించి వివరించాయి. కృష్ణా జిల్లాలో ఐదో రోజూ విజయవంతంగా కొనసాగింది. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తేనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు.

గుంటూరు జిల్లాలో నేతలు ఇంటింటికీ తిరిగి నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో అభివృద్ధికి బాటలు పడతాయని చెప్పారు. ప్రకాశం జిల్లాలో పార్టీ నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పార్టీ నేతలు నవరత్నాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లాలో పార్టీ నేతలతోపాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితే పేదలకు మంచి జరుగుతుందని పార్టీ నేతలు ప్రజలకు వివరించారు.

అనంతపురం జిల్లాలో పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి వైఎస్‌ జగన్‌ను సీఎంను చేయాలని కోరారు. వైఎస్సార్‌ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలంలోని ముదినేపల్లి, దళితవాడలో బీసీ వర్గానికి చెందిన 20 కుటుంబాలు, మైనార్టీ కుటుంబాలు 10 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. పార్టీ నేతలు నవరత్నాల గురించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ఇంటింటికీ తిరిగి నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.  

మరిన్ని వార్తలు