ఆ ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలు: ఫడ్నవీస్‌

2 Dec, 2019 16:08 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తన మూడు రోజులపాలనకు సంబంధించి వస్తున్న​ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందించారు. సోమవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదంతా పూర్తిగా అసత్య ఆరోపణ అని ఫడ్నవీస్‌ అన్నారు. తన మూడు రోజుల పాలనలో ఎలాంటి నిధులను కేంద్రానికి తిప్పి పంపలేదని ఆయన చెప్పారు. బుల్లెట్ రైలు విషయంలో భూసేకరణ చేయడం మినహా మహారాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో మరేమీ లేదని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం కానీ.. అలాంటి హామీని మహారాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడం కానీ జరగలేదన్నారు.

కాగా, గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ హడావిడిగా ప్రమాణం చేయడం వెనుక పెద్ద డ్రామా దాగి ఉందని.. '80 గంటలు ముఖ్యమంత్రిగా ఉండి.. మహారాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోని రూ. 40 వేల కోట్ల నిధులను కాపాడి.. తిరిగి కేంద్రానికి అప్పగించారని అనంతకుమార్‌ హెగ్డే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

చదవండి: అలాంటి పనులు మహారాష్ట్రకు ద్రోహం చేయడమే!

మరిన్ని వార్తలు