చంద్రబాబు కంటే నేరస్తుడెవరున్నారు?

22 Feb, 2019 08:12 IST|Sakshi
ఎల్లయ్యపేటలో జరిగిన పార్టీ చేరికల సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా

వెన్నుపోట్లు, అవినీతి, అక్రమాల్లో ఆయనను మించినవాళ్లు లేరు

అవినీతికి అడ్రస్‌గా మారిన యనమలకు జగన్‌ను విమర్శించే అర్హత లేదు

యనమల సోదరుల అవినీతిని నడిరోడ్డుకీడుస్తా..

కోన ఎల్లయ్యపేట సభలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజం

తూర్పుగోదావరి, తొండంగి (తుని): సొంత మామ ఎన్టీఆర్‌ను నమ్మించి, వంచించి, వెన్నుపోటు పొడిచి, అవినీతి, అక్రమాలకు, కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన నేరస్తుడు, మోసగాడు రాష్ట్రంలో వేరెవ్వరూ లేరని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. తొండంగి మండలం కోన ప్రాంతం జి.ముసలయ్యపేట పంచాయతీలోని మత్స్యకార గ్రామం ఎల్లయ్యపేటలో ఆయన సమక్షంలో సుమారు వంద కుటుంబాలకు చెందిన మత్స్యకారులు, యువత పార్టీ నాయకుడు సింగిరి సింగారం ఆధ్వర్యాన గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగానిర్వహించిన సభలో ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగినంత అవినీతి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదన్నారు. పాకిస్తానీయుల సహకారంతో జరిగిన ఉగ్రదాడిపై కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం బలపడటం, ఆయనకు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు, టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నా రు. ఆ భయంతోనే ఎన్నికల ముందు జగన్‌ ప్రకటిం చిన పథకాలను కాపీ కొడుతున్నారని, అయినప్పటి కీ చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అ న్నారు. విలువలకు, విశ్వసనీయతకు మారుపేరుగా ఉన్న జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీకి లేదన్నారు.

టీడీపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి ఆ సమయంలో ప్రజల కోసం ఈ పథకాలేవీ గుర్తుకు రాలేదని రాజా విమర్శించారు. ఆయన కూడా చంద్రబాబు మాదిరిగా కోన ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. నమ్మి ఓట్లేసిన జనం ప్రాణాలను హరించేవిధంగా దివీస్‌ కుంపటిని పెట్టడంతోపాటు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ దోపిడీ, తీరంలో ఇసుక దోపిడీ, ఒంటిమామిడి పోలీస్‌ స్టేషన్‌ క్వార్టర్స్‌ స్థలం కబ్జా వంటి అవినీతి, అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడిన యనమలకు వైఎస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. చంద్రబాబు, అనుచరగణం కంటే పెద్ద నేరస్తులు ఎవరుంటారని ప్రశ్నించారు. అక్రమ కేసులతో కోన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే తుని నియోజకవర్గంలో యనమల సోదరుల అవినీతిని నడిరోడ్డుకీడుస్తానని రాజా హెచ్చరించారు. యనమల పాలనపై ప్రజలు పూర్తిగా విసుగు చెందారని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు తుని నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం జిల్లా కన్వీనర్‌ కారే శ్రీనివాసరావు, పార్టీనాయకులు మాకినీడి గాంధీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, కొయ్యా శ్రీనుబాబు, మండల కన్వీనర్‌ బత్తుల వీరబాబు, యూత్‌ కన్వీనర్‌ ఆరుమిల్లి ఏసుబాబు, రాజానగరం మాజీ సర్పంచ్‌ చోడిపల్లి శ్రీనివాసరావు, మేరుగు ఆనందహరి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చొక్కా కాశీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు