కేటీఆర్‌కు వాళ్లను విమర్శించే స్థాయి లేదు

17 Jan, 2020 12:19 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ప్రధాని మోదీ, బీజేపీ నేత అమిత్‌ షాలను విమర్శించే స్థాయి లేదని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఏ బిల్లులో తేవాలో కేటీఆర్‌ దగ్గర ట్యూషన్‌ చెప్పించుకునే అవసరం వారికి లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. మోదీని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు. భైంసా ఘటనలకు వ్యతిరేకంగా తాను శనివారం నాడు ఒకరోజు నిరాహార దీక్ష తలపెడితే పోలీసులు అనుమతి లేదంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఎంఐఎం వాళ్లకు అనుమతులు అవసరం లేకుండానే సభలు పెట్టుకోవచ్చు.. కానీ బీజేపీకి మాత్రం అసలు అనుమతులే దొరకవా? అంటూ మండిపడ్డారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో 40 సీట్లతో బీజేపీ మేయర్‌ స్థానం కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి మేయర్‌ కాగానే పాలకవర్గం నిజామాబాద్‌ పేరును ఇందూరుగా మారుస్తూ తొలి తీర్మానం చేస్తుందని ధర్మపురి అర్వింద్‌ వెల్లడించారు.

చదవండి:

భైంసాలో తొలగని భయం!

మరిన్ని వార్తలు