విద్యుత్‌ కంపెనీలకు రూ. 90 వేల కోట్లేందుకు?

14 May, 2020 14:04 IST|Sakshi

భోపాల్‌: కరోనా వైరస్‌ సంక్షోభ సమయంలో ఆర్థిక ప్యాకేజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తీవ్రంగా మండిపడ్డారు. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పేరిట కేంద్రం రూ. 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్మికులకు ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ముందుగా రూ. 90 వేల కోట్లను విద్యుత్‌ ఉత్పతి కంపెనీలకు కేటాయించారని ఆయన ట్విటర్‌లో వేదికగా విమర్శించారు. ఎవరు ఎక్కవ సంఖ్యలో  విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలను కలిగి ఉన్నారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. (నిర్మలా సీతారామన్‌ ప్రెస్‌మీట్‌ : నేడు వ్యవ‘సాయం’)

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభ సమయంలో దెబ్బతింటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా  కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వివరలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం మీడియాకు వివరించారు. ముందుగా రూ. 6 లక్షల కోట్ల వివరాలను ఆమె తెలియజేస్తూ.. రూ. 90 వేల కోట్లను విద్యుత్‌ ఉత్పతి కంపెనీలకు కేటాయించినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు