ఆ ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు

1 Jul, 2020 19:41 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా పార్టీలో ముగ్గురు సీనియర్‌ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిలకు అప్పగిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.(చదవండి : ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభం)

విజయసాయిరెడ్డికి.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల బాధ్యతలు, వైవీ సుబ్బారెడ్డికి.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతలు, సజ్జల రామకృష్ణారెడ్డికి.. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, వైఎస్సాఆర్‌ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. మరోవైపు తాడేపల్లిలో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి చూడాల్సిందిగా నిర్ణయించారు. అలాగే, పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు