కేసీఆర్‌ ముస్లిం నమ్మక ద్రోహి: డీకే అరుణ

27 Jan, 2020 18:43 IST|Sakshi

సాక్షి, నారాయణపేట: మక్తల్‌, నారాయణపేటలో బీజేపీకి గట్టి పట్టు ఉందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. అందుకే మక్తల్ మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాన్ని సోమవారం బీజేపీ కైవసం చేసుకుందని ఆమె తెలిపారు. ఈ సందర్భం‍గా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. రాష‍్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడం సహజమన్నారు. సీఎం కేసీఆర్‌ మున్సిపల్‌ ఎన్నికల ముందు బీజేపీ గెలిచే స్థానాల్లో ముస్లింల ఓట్లు రాబట్టుకునేందుకు.. ఎన్‌ఆర్‌సీ, సీఏఏల పేరు తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారని మండిపడ్డారు. (బీజేపీ నైతికంగా విజయం సాధించింది)

సీఎం కేసీఆర్‌కు దేశం గురించి గాని, దేశ భద్రత గురించి అవసరం లేదా అని ఆమె ప్రశ్నించారు. ఎన్‌ఆర్‌సీ చట్టం తీసుకుచ్చిన తర్వాత ముస్లింల గురించి మాట్లాడున్నాడంటే కేసీఆర్‌ ఎంత నమ్మక ద్రోహి అనేది ముస్లింలు గమనించాలి. బైంసా సంఘటన జరిగినప్పుడు సీఎం కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదని అరుణ ప్రశ్నించారు. ప్రజలు తలలు పగలగొట్టుకున్నా, చచ్చినా తనకు సంబంధం లేనట్లు వ్యవహరించారని ఆమె ధ్వజమెత్తారు. అప్పుడు నోరుమెదపని కేసీఆర్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఎందుకు మాట్లాడారని అరుణ సూటిగా ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు