డీఎండీకే అధినేతకి అస్వస్థత

3 Oct, 2018 16:04 IST|Sakshi

సాక్షి, చెన్నై : : డీఎండీకే అధినేత, తమిళ ప్రముఖ నటుడు విజయకాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. అరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆదంబాక్కంలోని మియాట్ ఆస్పత్రికి తరలించారు. గత కొంత కాలంగా విజయ్‌ కాంత్‌ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సినీ నటుడిగా అశేష అభిమానుల నాయకుడిగా మన్ననల్ని అందుకున్న విజయకాంత్‌ డీఎండీకేతో రాజకీయాల్లో అడుగు పెట్టి ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి చేరారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు