‘ప్రధాని ఎవరో చంద్రబాబు నిర్ణయిస్తారు’

25 Mar, 2018 13:58 IST|Sakshi
డొక్కా మాణిక్యవరప్రసాద్‌

సాక్షి, అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ అబద్ధాల పుట్ట అని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బాహుబలి సినిమాలో కాలకేయుడు పలికిన కిలికిలి భాషలో అమిత్‌ షా లేఖ ఉందని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అబద్దాల ఫ్యాక్టరీలో తయారైన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. మాట వినని వారిపై సీబీఐ కేసులంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదానే దేశ రాజకీయాలు శాసిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత దేశానికి కాబోయే ప్రధానమంత్రి ఎవరో చంద్రబాబు నాయుడు నిర్ణయించబోతున్నారని జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు