బీజేపీలోకి త్వరలో టీఆర్‌ఎస్‌ ఎంపీ

20 Aug, 2019 02:29 IST|Sakshi

సుభాష్‌నగర్‌: తన తండ్రి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపర్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తనను నమ్మి బీజేపీలో చేరుతున్న డీఎస్‌ అనుచరవర్గానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జిల్లాకు నిజామాబాద్‌ పేరు ఉండటాన్ని ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారన్నారు. పేరులో నిజాం ఉండటం వల్ల నిజాంసాగర్‌ నిండడం లేదని, నిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీ మూత పడిందని, నిజామాబాద్‌ రైతులు బాగుపడటం లేదని పేర్కొన్నారు. వెంటనే ఇందూరుగా పేరు మార్చాలని ప్రజల నుంచి డిమాండ్‌ వస్తోందన్నారు. కాంగ్రెస్‌కు దిశానిర్దేశం చేసే నాయకుడు లేకుండా పోయారని అర్వింద్‌ ఎద్దేవా చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేసిన ప్రధాని మోదీ.. దేశంలో కామన్‌ సివిల్‌ కోడ్‌ (సీసీసీ)ను తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు