బెంగాల్‌లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం

21 May, 2019 14:35 IST|Sakshi

కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గం 200వ పోలింగ్‌ కేంద్రం రీపోలింగ్‌

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్లోని కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గంలో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నియోజకవర్గంలోని 200వ పోలింగ్‌ కేంద్రంలో ఈనెల 19న జరిగిన పోలింగ్‌ను ఈసీ రద్దు చేసి.. రీపోలింగ్‌కు ఆదేశించింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గం 200వ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ నిర్వహించాలని బెంగాల్‌ ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేయాలని, ఆ కేంద్రం పరిధిలోని ఓటర్లకు సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

కాగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌తో పాటు బీజేపీ నేతలు బెంగాల్‌లో అల్లర్లు జరిగిన కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని, తమ నేతలపై నమోదైన తప్పుడు కేసులను కొట్టివేయాలని ఈసీని కోరిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన ఈసీ వెంటనే అక్కడి అధికారుతో సంప్రదించి ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఆరు, ఏడో విడత ఎన్నికల సందర్భంగా బెంగాల్‌ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల పోలింగ్‌కు అంతరాయం కలిగిందని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు