మాజీ జవాన్‌ నామినేషన్‌ తిరస్కరణ

2 May, 2019 04:58 IST|Sakshi

వారణాసి: వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. భద్రతాబలగాలకు పెట్టే ఆహార నాణ్యతపై ఫిర్యాదు చేస్తూ ఆన్‌లైన్‌లో వీడియో పెట్టడంతో 2017లో తేజ్‌ బహదూర్‌ను విధుల నుంచి తొలగించారు. ఆయన సమర్పించిన రెండు జతల నామినేషన్‌ పత్రాల్లో తేడాలున్నట్లు గుర్తించిన వారణాసి రిటర్నింగ్‌ అధికారి వాటిని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకూడదనే బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు