మోదీ కోసమే షెడ్యూల్‌ ఆలస్యం..!

5 Mar, 2019 09:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కాంగ్రెస్‌ సీనియర​నేత, కేంద్రమాజీ మంత్రి అహ్మద్‌ పటేల్‌ కేంద్ర ఎన్నికల సంఘంపై పలు ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ పర్యటనలు ముగిసే వరకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయకుండా సీఈసీ ఆలస్యంచేస్తోందని అన్నారు. ఆయన అనుమతి తీసుకుని షెడ్యూల్‌ను ప్రకటించాలని ఈసీ చూస్తోందని, ఎన్నికల చివరి క్షణంలో కూడా మోదీ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రధాని హోదాలో దేశమంతా పర్యటిస్తూ ఎన్నికల హామీలను ఇస్తున్నారని అహ్మద్‌ పటేల్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథిలో ప్రధాని పర్యటన సందర్భంగా 538 కోట్లు విలువచేసే హామీలు ఇచ్చారని, ఇదంతా ఎన్నికల స్టంటేనని పేర్కొన్నారు. (ఈ వారంలోనే ‘సార్వత్రిక’ షెడ్యూల్‌)

ఇది ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, మరో నెలరోజుల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఎన్నికల కోడ్‌ను అమలుచేయాలని ఈసీని కోరారు. గతంలో గుజారాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహిరించిందని ఆరోపించారు. కేంద్ర మంత్రులంతా దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారని ఇదంతా ఎన్నికల వ్యూహాంలో భాగమేనని పేర్కొన్నారు. ఈసీ వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం అహ్మద్‌ పటేల్‌ వరుస ట్వీట్లను పోస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు