ఇబ్రహీంపట్నంలో భారీగా డబ్బులు పట్టివేత..?

15 Oct, 2018 16:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం.. ఇన్‌సెట్లో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఎత్తులు పైఎత్తులతో పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టాగా.. ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ కసరత్తులు మొదలుపెట్టింది. ఎలక్షన్‌ స్క్వాడ్‌లను రంగలోకి దించి ముమ్మురమైన తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద సోమవారం ఎలక్షన్‌ స్క్వాడ్‌  తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న దాదాపు 27 లక్షల నగదును ఎలక్షన్‌ స్క్వాడ్‌ అధికారులు పట్టుకున్నట్టు సమాచారం. పట్టుబడిన సొమ్ము ఆదిబట్ల గ్రామ ఉపసర్పంచ్‌ పల్లె గోపాల్‌ గౌడ్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. అయితే, గోపాల్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుచరుడు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో ఖర్చుచేయడానికే సొమ్మును తరలిస్తున్నారని విమర్శలు గుప్పించాయి.

మరిన్ని వార్తలు