లెక్క పక్కా!

20 Mar, 2019 12:43 IST|Sakshi

లోక్‌సభ అభ్యర్థుల భారీ ఖర్చుకు బ్రేక్‌

పదార్థాలు, ప్రచార సామగ్రికి ధరల నిర్ణయం

సాక్షి,సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నామినేషన్‌ వేసిన రోజు నుంచి పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చును చూపించాల్సిందే.  లోక్‌సభ అభ్యర్థులు రూ.70 లక్షలకు మించకుండా ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం నిబంధన. ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల రోజు నిర్వహించే ర్యాలీల నుంచి మొదలు ప్రచారసామగ్రి, సభలు నిర్వహిస్తే ఏర్పాటు చేసే టెంట్లు, కుర్చీలు, వెంటవచ్చే పార్టీ శ్రేణుల టీ, టిఫిన్ల ఖర్చులన్నీ లెక్క చూపాల్సిందే. కమిషన్‌ సూచించిన పరిమితికి మించి ఖర్చు చేస్తే అనర్హత వేటు పడే ప్రమాదం కూడా ఉంది. అలాగని ఎన్నికల ఖర్చు ‘లెక్క’లు తగ్గించి చూపుతామని పది రూపాయల ఖర్చును ఐదు రూపాయలుగా చూపాలనుకుంటే కుదరదు.

ఒక భోజనానికి రూ.100 ఖర్చు చేసి దాన్ని రూ.30 చూపుదామనుకుంటే కుదరదు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమ మందీ మార్భలానికి.. టీ, టిఫిన్లకు దేనికెంత ఖర్చు చేయాలో జిల్లా అధికారులు ధరలను నిర్ణయించారు. అభ్యర్థులు తమ ఖర్చు పద్దులో ఆయా అంశాలు, సరుకులు, సామగ్రి, కార్యకర్తల ఏర్పాట్లు, వాహనాలు తదితరమైన వాటికి రేట్లు ఎంతుండాలో కూడా నిర్ణయించారు. ఆ ధరల కంటే తక్కువ చూపితే ఎన్నికల వ్యయంలో పేర్కొన్న లెక్కలను ఆమోదించరు. ప్రతిపాదించిన ధరల మేరకే లెక్క చూపాలి. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలుంటే  కొన్ని మార్పులు చేసే అవకాశముంది.

దేనికెంత ధర అంటే.. 

మరిన్ని వార్తలు