ఉద్దండుల కోట..  నరసరావుపేట

16 Mar, 2019 09:05 IST|Sakshi
నల్లపాటి వెంకట రామయ్యచౌదరి, మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి

సాక్షి,నరసరావుపేట: నరసరావుపేట అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు మొదటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఉద్దండులనే అందించాయనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. పలనాడు ముఖద్వారంగా ఉన్న నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం, గుంటూరు–ప్రకాశం జిల్లాలతో పాటు కలిసి కొన్నేళ్లపాటు కొనసాగిన నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం మొదటి నుంచి విలక్షమైనవే. ఈ నియోజకవర్గాల నుంచి పోటీచేసిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించడం గమనార్హం.

  • కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన నల్లపాటి వెంకటరామయ్యచౌదరి ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర తొలిస్పీకర్‌గా 1953 నుంచి 1955 వరకు బాధ్యతలను నిర్వహించిచారు.
  • 1967లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలిచిన కాసు బ్రహ్మానందరెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏడేళ్ల పాటు కొనసాగారు. 
  • కాసు కృష్ణారెడ్డి సైతం మూడుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించి  మంత్రి పదవులను చేపట్టారు.
  • డాక్టర్‌ కోడెల అత్యధికంగా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వరుసుగా ఐదుమార్లు విజయం సాధించి, 12ఏళ్ల పాటు మంత్రివర్గంలో వివిధ శాఖలు నిర్వహించారు. 
  • పార్లమెంట్‌ సీటు రూటే సెపరేటు..
  • 1952లో నరసరావుపేట పార్లమెంట్‌ అభ్యర్థిగా సీఆర్‌ చౌదరి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఆ తర్వాత 1967, 71 ఎన్నికల్లో  మద్ది సుదర్శనం రెండుసార్లు గెలుపొందగా, 1977, 1980లో కాసు బ్రహ్మానందరెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర హోంశాఖమంత్రిగా అత్యున్నత పదవిని చేపట్టారు. ఆయనతో పాటు  కాసు వెంకటకృష్ణారెడ్డి సైతం  రెండుసార్లు ఎంపీగా విజయాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే 1999లో  మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి, 1998లో మరో మాజీ ముఖ్యమంత్రి  కొణిజేటి రోశయ్య, 2004లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, 2009లో మోదుగుల వేణుగోపాలరెడ్డి, 2014లో రాయపాటి శంభశివరావు ఎంపీలుగా ఇక్కడి నుంచి గెలిచినవారే. 
మరిన్ని వార్తలు