తెనాలిలో చంద్రబాబు సభ అట్టర్‌ప్లాప్‌.. 

5 Feb, 2020 09:44 IST|Sakshi

సాక్షి, గుంటూరు : రాజధాని పేరుతో టీడీపీ చేస్తున్న కృత్రిమ ఉద్యమానికి జనం మద్దతు లేదని మరోసారి స్పష్టం అయింది. అమరావతి జేఏసీ పేరిట తెనాలిలో నిర్వహించిన సభ జనం లేక అట్టర్‌ప్లాప్‌ అయింది. ఈ సభకు 20 వేల మందిని సమీకరించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించినప్పటికీ.. కేవలం 2వేల మంది కూడా హాజరుకాలేదు. జనం లేకపోవడంతో టీడీపీ నేతలు సభను ఆలస్యంగా ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు జరపాల్సిన సభను.. చివరకు రాత్రి 8 గంటల సమయంలో నిర్వహించారు. అయితే వచ్చిన కొద్ది మంది కూడా మధ్యలోనే వెళ్లిపోవడంతో సభ వెలవెలబోయింది. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కూడా ఎవరు పట్టించుకోలేదు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయానికి సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. 

దీంతో చంద్రబాబు తన బాధను ఖాళీ కుర్చీలకే చెప్పుకోవాల్సి వచ్చింది. జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు కూడా ఈ సభకు హాజరుకాకపోవడం గమనార్హం అయితే సభ విఫలం కావడంపై చంద్రబాబు జిల్లా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అమరావతి పేరిట రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుకు.. ఈ ఘటనతో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. 

మరిన్ని వార్తలు