యంత్రంలో ఓటు మంత్రం

11 Apr, 2019 10:10 IST|Sakshi

సాక్షి, నరసరావుపేట : ఎన్నికల సమరంలో పోలింగ్‌ ప్రక్రియ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అందులోనూ గతంలో మాదిరి బ్యాలెట్‌ ఓటింగ్‌ కాకుండా.. ఈవీఎం, వీవీప్యాట్‌ల ద్వారా ఓటు వేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో ఓటు ఏలా వేయాలో తెలుసుకుందాం. 
పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశం  
మీరు పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లేసరికి ప్రిసైడింగ్‌ అధికారి మీ బ్యాలెట్‌ను సిద్ధంగా ఉంచుతారు.
ఓటు వేయడం ఇలా 
బ్యాలెట్‌ యూనిట్‌(ఈవీఎం)పైన మీకు నచ్చిన అభ్యర్థి పేరు, ఫొటో, గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు(బ్లూ) బటన్‌ను గట్టిగా నొక్కాలి.
సిగ్నల్‌ : ఓటు వేసినప్పుడు మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరు, గుర్తుకు ఎదురుగా ఎర్రలైట్‌ వెలుగుతుంది.
ప్రింట్‌ను చూడండి 
ప్రింటర్‌– మీరు ఎన్నుకున్న అభ్యర్థి సీరియల్‌ నంబర్, పేరు, ఫొటో, గుర్తుతో ఓ బ్యాలెట్‌ స్లిప్‌ ప్రింట్‌ను వీవీప్యాట్‌లో చూడవచ్చు. 
గమనించాల్సిన విషయం
ఒక వేళ మీకు బ్యాలెట్‌ స్లిప్‌ కనిపించకపోయినా, బీప్‌ శద్ధం గట్టిగా వినిపించకపోయినా ప్రిసైడింగ్‌ అధికారిని సంప్రదించవచ్చు.

ఓటు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటేయొచ్చు!  
ఓటర్‌ జాబితా సవరణతో కొత్తగా ఓటర్‌గా నమోదైన వారికి సైతం ఇటీవల గుర్తింపు కార్డులు వచ్చాయి. అయితే ప్రస్తుత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండీ గుర్తింపు కార్డు లేదని బాధపడుతున్నారా! ఇప్పుడు ఆ చింత అవసరం లేదు. ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.  
ఇవి ఉంటే సరి.. 
డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఆధార్‌కార్డు, ఫొటోతో ఉన్న బ్యాంక్‌ పాస్‌పుస్తకం, పోస్టాఫీసులు జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్‌బుక్, ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు, పింఛన్‌కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు .. ఇలా వీటిల్లో ఏదో ఒక దానిని చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.   

చాలెంజ్‌ ఓటు.. ఏప్రిల్‌ 11 
2019ఓటరు గుర్తింపు విషయంలో అధికారులకు సందేహం కలిగినా, ఏజెంట్లు అభ్యంతరం చెప్పినా సదరు ఓటర్‌ తన గుర్తింపును చాలెంజ్‌ చేసి రుజువు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని పేరు తప్పు చెబుతున్నాడని ఏజెంట్‌ అభ్యంతరం చెబితే ఓటర్‌ను.. ఏజెంట్‌ను ప్రిసైడింగ్‌ అధికారి వద్దకు పంపుతారు.

అభ్యంతరం చెప్పిన ఏజెంట్‌ నుంచి రూ. 2 చాలెంజ్‌ ఫీజుగా తీసుకుంటారు. అప్పుడు ఓటర్‌ వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే బీఎల్‌ఓను పిలిచి అతడు స్థానిక ఓటరా కాదా అనే విషయం.. పేరు, తండ్రి పేరు లాంటి వివరాలు తెలుసుకుంటారు.

అతడు స్థానిక ఓటరై, జాబితాలో ఉన్న పేరు వాస్తవం అయితే వయన్సు, తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటరు ఇద్దరిలో ఎవరి వాదన సరైందని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రిసైడింగ్‌ అధికారి మొదటిసారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్‌ను, ఓటరును పోలీసులకు అప్పగించవచ్చు.  

మరిన్ని వార్తలు