జనచైతన్య యాత్ర కమిటీల ఏర్పాటు 

19 Jun, 2018 02:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెలలో జనచైతన్య యాత్రలు మొదలు కాబోతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా పలు కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో కీలకమైన సలహా కమిటీని నలుగురితో ఏర్పాటు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, శాసన మండలిలో పార్టీ నేత రామ్‌చంద్రరావులు ఉన్నారు. యాత్ర ప్రముఖ్, సహ ప్రముఖ్‌లుగా మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆచారి, మనోహర్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, హెడ్‌ క్వార్టర్స్‌ ఇన్‌చార్జిగా చింతా సాంబమూర్తి ఉన్నారు.

ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, యెండల లక్ష్మీనారాయణసహా 20 మందితో ఆర్గనైజింగ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఆర్థిక విభాగం, రూట్‌ ఇన్‌చార్జి విభాగం, భోజన విభాగం, రాత్రి వసతి, ప్రోటోకాల్, మీడియా, ప్రకటనలు, రోడ్‌ షోలు, మీటింగ్స్‌ వేదికలు, రథం, రక్షణ విభాగం, మహిళా విభాగం, సాంస్కృతిక జట్టు, వైద్య విభాగం, పబ్లిసిటీ మెటీరియల్, యాత్ర వాహన శ్రేణి జట్టు.. ఇలా పలు విభాగాలను ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు