‘నీటి సమస్యలపై దృష్టి పెట్టండి’

16 Jul, 2019 11:15 IST|Sakshi

ఎంపీలకు ప్రధాని మోదీ సూచన

సాక్షి, న్యూఢిల్లీ : తాగునీటి సమస్యలపై ప్రతి ఒక్క ఎంపీ దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నీటీ సమస్య అనేది ప్రజల దృష్టిలో పెద్ద సమస్య అని, దీనిపై దృష్టి సారించి పరిష్కార మార్గాలను కనుక్కోవాలని ఎంపీలను సూచించారు. రాజకీయాలను పక్కనపెట్టి తమ తమ నియోజకవర్గాలలో పర్యటిస్తూ నీటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎంపీలకు చెప్పారు.

మరిన్ని వార్తలు