కారెక్కనున్న ముఖేష్‌?

14 Dec, 2017 10:28 IST|Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మూల ముఖేష్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. గత ఏడాదిన్నర కాలంగా సందిగ్ధంలో ఉన్న ముఖేష్‌ ఎట్టకేలకు కారెక్కేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు నగరానికి చెందిన ఓ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాయబారం నడిపి చేరికకు లైన్‌ క్లియర్‌ చేసినట్లు తెలిసింది.

సాక్షి, హైదరాబాద్‌: గోషామహల్‌ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు ఊహాగానాల నేపథ్యంలో స్థానిక కార్యకర్తల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ముఖేష్‌ ఈ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌ హయాంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీ చేసిన ముఖేష్‌గౌడ్‌ 47 వేల పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సర కాలం నుంచి ముఖేష్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతోంది.  

ఎంపీ రాయబారంతో గ్రీన్‌ సిగ్నల్‌...
తెలంగాణ రాష్ట్రంలో ఓ పార్టీ అధ్యక్షుడు, నగరానికి చెందిన ఒక పార్లమెంట్‌ సభ్యుడు ముఖేష్‌గౌడ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్పించేందుకు కేసీఆర్‌ వద్ద రాయబారం నడిపినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఆ ఎంపీ కేసీఆర్‌కు నచ్చజెప్పడంతో ముఖేష్‌గౌడ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఎంజే మార్కెట్‌లోని తన కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన ముఖేష్‌గౌడ్‌ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో సమావేశం కానున్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరే తేదీని ప్రకటిస్తారని తెలిసింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా