ఎగ్జిట్‌ ఫోల్స్‌కు షాక్‌

24 Oct, 2019 18:38 IST|Sakshi

న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ ఫోల్స్‌కు షాక్‌ ఇచ్చాయి. ప్రముఖ సంస్థలు ఇండియాటుడే, ఆక్సిస్ వన్‌ మినహా అన్ని ఎగ్జిట్‌ ఫోల్స్‌ బీజేపీకి 90 సీట్లకుగాను 70 సీట్లు సాధిస్తాయని తెలిపాయి. కానీ, ఫలితాలు ఎగ్జిట్‌ ఫోల్స్‌ అంచనాలకు బిన్నంగా రావడం గమనార్హం. ప్రస్తుత ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌ బట్టి చూస్తే బీజేపీకి 40సీట్లు, కాంగ్రెస్‌కు 31సీట్లు, జేజేపీ 10, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించాయి.

2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి 58శాతం ఓట్లు రాగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో 36శాతానికి పడిపోవడంతో రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జాట్‌యేతర సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను సీఎంగా నియమించడం వల్ల జాట్‌లు బీజేపీకి దూరమయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా వీస్తున్నప్పటికి స్థానిక నాయకత్వం వాటిని ఓట్ల రూపంలో మలుచుకోవడంలో విఫలమయ్యారని పలువురు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వార్తలు