ఆ ఖర్చూ ఎన్నికల వ్యయమే: ఈసీ

9 Nov, 2018 03:54 IST|Sakshi

న్యూఢిల్లీ: అభ్యర్థుల నేరచరిత్ర గురించి మీడియాలో ఇచ్చే ప్రకటనలకు అయ్యే ఖర్చును ఎన్నికల ప్రచార వ్యయంలో భాగంగానే పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఈసీ ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. నేరచరిత్రకు సంబంధించిన ప్రకటనల ఖర్చును అభ్యర్థులు, రాజకీయ పార్టీలే భరించాలని స్పష్టం చేసింది. నామినేషన్‌ పత్రాలు దాఖలుచేసిన తరువాత నేరచరిత్రలో ఏమైనా మార్పులు జరిగితే సవరించిన వివరాల్ని కూడా ప్రచురించి, రిటర్నింగ్‌ అధికారికి వెల్లడించాలని సూచించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యయానికి పరిమితి లేదు. కానీ అభ్యర్థి వ్యయం రూ.28 లక్షలకు మించకూడదు. 

>
మరిన్ని వార్తలు