మేనిఫెస్టోల అమలు చర్యల్ని వివరించండి

13 Nov, 2018 01:39 IST|Sakshi

ఈసీని ఆదేశించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ పార్టీలు ప్రకటించే ఎన్నికల మేనిఫెస్టోలను కచ్చితంగా అమలు చేసే లా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై వైఖరిని తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశిం చింది. మేనిఫెస్టోల వ్యవహారంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలుకు ఏ చర్యలు తీసుకున్నా రో కూడా తెలపాలని పేర్కొంది. సుబ్రమణ్యం బాలాజీ–తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తెలంగాణ ఎన్నికల్లో పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోల అమలుకు వర్తిం పజేయాలని కోరుతూ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఎం. నారాయణాచార్యులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ల ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. మేనిఫెస్టోల ద్వారా పార్టీలు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఆయా పార్టీ లకు ఓట్లు వేస్తారని, మేనిఫెస్టో అమలుకు పార్టీ లు కట్టుబడి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది గోపాలరావు వాదించా రు. పార్టీలు విధిగా మేనిఫెస్టోలు ప్రకటించాలన్న నిబంధన ఏమీ లేదని, మేనిఫెస్టోల్ని ప్రకటించిన పార్టీలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు అవుతాయని ఈసీ తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు