ఫడ్నవిస్‌పై శివసేన ప్రశంసలు

18 Jul, 2020 17:44 IST|Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌‌పై శివసేన ప్రశంసల వర్షం కురిపించింది. ప్రతిపక్ష నేత బాధ్యతలకు ఆయన సరైన న్యాయం చేస్తున్నారని, విపక్షనేత పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారని వ్యంగ్యంగా ఆకాశానికెత్తింది. అంతేకాకుండా కరోనా నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఫడ్నవిస్‌ అభినందించారని, ఇది తమకు ఎంతో నైతిక బలనిచ్చిందని శివసేన సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం తన అధికారిక పత్రిక సామ్నాలో  ఎడిటోరియల్‌ను ప్రచురించింది. (ఆపరేషన్‌ కమల్‌పై బీజేపీ క్లారిటీ)

‘దేవేంద్ర ఫడ్నవిస్‌ సీఎంగా ఉన్న సమయంలో ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించారు. చాలా ధైర్యంగా, డైనమిక్‌గా వ్యవహరించారు. తనకు కోవిడ్ పాజిటివ్ వస్తే... కచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం తీసుకుంటా అని ప్రకటించడం చెప్పడం మంచి పరిణామం. ప్రతిపక్ష నేతగా ఆయన నూటికి నూరుపాళ్లూ సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ వ్యవస్థపై ఆయనకు ఎంతో విశ్వాసం ఉంది’ అనిని శివసేన ఎడిటోరియ్‌లో పేర్కొంది. కాగా కరోనా కష్ట సమయంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ ఫడ్నవిస్‌ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు హోంమంత్రి అమిత్‌ షాను సైతం కలిసిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా