ఆయనకు అభిమానినే కానీ..

15 Apr, 2019 10:05 IST|Sakshi
కమలహాసన్‌తో అనిత సోదరుడు మణిరత్నం

పెరంబూరు: నటుడు కమలహాసన్‌కు నేను వీరాభిమానిని. అయితే నా ఓటు మాత్రం ఆయనకు వేయను. నేనే కాదు నా కుటుంబం అంతా తిరుమావళవన్‌కే ఓటు వేస్తాం అని మణిరత్నం అనే కమలహాసన్‌ అభిమాని అన్నారు. ఇతనెవరో కాదు నీట్‌లో సీటు లభించక ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని అనిత సోదరుడు. మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు  కమలహాసన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ సభలు, సమావేశాలతో బిజీగా ఉన్న కమలహాసన్‌ తాజాగా సామాజక మాధ్యమాలను ప్రచారానికి వాడుకుంటున్నారు. ఆయన శనివారం యూట్యూబ్‌లో వీడియోను విడుదల చేశారు. అందులో డీఎంకే, అన్నాడీఎంకే నేతలను తీవ్రంగా విమర్శంచారు. ముఖ్యంగా మొత్తం రాజకీయం నీట్‌ పేరుతో ఒక యువతిని హత్య చేశారే, ఆమె తల్లిదండ్రులను అడగండి ఓటు ఎవరికి వేయాలన్నది  అని పేర్కొన్నారు ఆ వీడియోకు చాలా మంది స్పందిస్తున్నారు.

అలా స్పందించిన వారిలో అనిత సోదరుడు మణిరత్నం కూడా ఉన్నాడు. అతను తన ఫేస్‌బుక్‌లో పేర్కొంటూ ప్రియమైన అన్న  కమలహాసన్‌కు నేను నిజమైన అభిమానిని.నటనలోనే కాదు నిజజీవితంలోనూ సంప్రదాయాలను బ్రేక్‌ చేయాలనే కళాకారుడాయన. ఇతరులేమనుకుంటే ఏమిటీ తానుకున్నది చేసే వ్యక్తి కమలహాసన్‌. తన అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చారు. ఆయనను చూసే నేను 18 సార్లు రక్తదానం చేశాను. అవయవదానం కూడా చేశాను. కొత్తగా ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా సంతోషమే. అన్న కమలహాసన్‌ మక్కళ్‌ నీది మయ్యం పార్టీకి నా శుభాకాంక్షలు. కమలహాసన్‌ చెప్పినట్లు ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో మేము తెలివిగానే ఉన్నాం. మా కుటుంబం మొత్తం తిరుమావళవన్‌కే ఓటు వేస్తాం, అనిత మరణించినప్పుడు ఆయన ఈ విషయాన్ని వదిలి పెట్టకూడదు అన్ని గట్టిగా మాట్లాడారు. అదే తిరుమావళవన్‌ మా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆయన డీఎంకే కూటమికి చెందిన వారు. నీట్‌ రద్దు వ్యవహారంపై డీఎంకే పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ పొత్తు పెట్టుకున్న జాతీయ పార్టీ కాంగ్రేస్‌ నీట్‌ను రద్దు చేస్తానని హామీ ఇచ్చింది. కాబట్టి తమ కుటుంబం మొత్తం తిరుమావళవన్‌కే ఓటు వేస్తామని అన్నారు. అతని తండ్రి షణ్ముగం కూడా కమలహాసన్‌ వ్యాఖ్యలను అన్ని పార్టీల వారు విమర్శిస్తున్నారనీ, అయితే ఆయన మాటల్లోనూ వాస్తవం ఉందనీ అన్నాడు. కానీ తమ ఓట్లు మాత్రం తిరుమావళవన్‌కే వేస్తామని అన్నాడు.

నాన్నకే ఓటేస్తానని ఎందుకన్నానంటే
కాగా కమలహాసన్‌కు మద్దతుగా ఆమె కూతురు,నటి శ్రుతీహాసన్‌ ఓట్లు అడిగే పనిలో పడ్డారు. అయితే ఆమె ప్రత్యక్షంగా ప్రజల ముందుకు వెళ్లకుండా సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారు. శ్రుతీహాసన్‌ ఇటీవల  తన ట్విట్టర్‌లో నా తండ్రిని చూస్తుంటే గర్వంగా ఉంది. మెరుగైన భవిష్యత్‌ కోసం, సమాజం కోసం మీ దష్టిలో ఒక విజన్‌ ఉంది. దాన్ని మీ ప్రయత్నం,ఆసక్తి, నిజాయితీ ద్వారా సాధించగలుగుతారు.మార్పు కోసం నా ఓటు మీకే అని పేర్కొన్నారు. కాగా శ్రుతి ట్విట్టర్‌ను ఫాలో అవుతున్న ఆమె అభిమానులు చాలా మంది స్పందిస్తున్నారు.అందులో ఒకరు నా ఓటు మీకే అని ఎలా చెప్పగలుగుతున్నారు? తండ్రి అనే బంధం కాకుండా, ఏ అభ్యర్థి సరైన వారు అన్నది ఎలా నిర్ణయించుకోవాలి,మీ తండ్రి సహా అని శ్రుతిహాసన్‌ను ప్రశ్నించారు.అందుకు శ్రుతిహాసన్‌ బదులిస్తూ కరెక్ట్‌గా చెప్పాలంటే  నా తండ్రి అని ఓటు వేయమని కోరడం లేదు. ఆయన మార్పు కోసం పని పోరాడుతున్నారనే నా ఓటు మీకే అని చెప్పానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు