సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రాజధాని రైతుల ధర్నా

17 Mar, 2018 15:51 IST|Sakshi
సీఆర్డీఏ కార్యాలయం (ఫైల్‌ ఫొటో)

సాక్షి, విజయవాడ: ప్రభుత్వం బలవంతంగా తమ భూములు లాక్కుంటున్నదంటూ రాజధాని రైతులు.. అమరావతిలోని  సీఆర్డీఏ ఆఫీస్‌ ఎదుట శనివారం ధర్నాకు దిగారు. విజయవాడలో రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కోసం తాజాగా విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు.

ఇప్పటికే రాజధాని కోసమని రైతుల నుంచి సేకరించిన 33వేల ఎకరాల భూముల్లో ఎటువంటి నిర్మాణం చేపట్టలేదని, ఇప్పుడు రింగ్‌ రోడ్‌ పేరిట మరో 24 వేల ఎకరాల భూమిని కాజేయాలని చూస్తోందని రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు. భూ మాఫియా కోసమే మూడు పంటలు పండే రైతుల భూములను సేకరిస్తున్నారని విమర్శించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు భూములు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఒకవేళ బలవంతంగా భూములు లాక్కుంటే.. కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం భూములు లాక్కుంటే.. వారి కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు