ఆజంఖాన్‌ నుంచి విముక్తికే పోటీ

9 Apr, 2019 04:40 IST|Sakshi

రామ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి జయప్రద

లక్నో: తన ప్రత్యర్థి ఆజంఖాన్‌ నుంచి రామ్‌పూర్‌ ప్రజలకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సినీనటి, రాజకీయ నాయకురాలు జయప్రద అన్నారు. రామ్‌పూర్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగారు. ‘రామ్‌పూర్‌ ప్రజల కోసం పనిచేయడానికే ఉన్నాను. ఆజం తాను పాల్పడుతున్న అక్రమాలను చట్టబద్ధం చేసేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కానీ నేను ఈ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను’ అని పీటీఐ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

ఆజం తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ఆయన ఏదైనా మాట్లాడగలడు. ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదు. అటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటు. కానీ రామ్‌పూర్‌ ప్రజలకు ఆయన గురించి బాగా తెలుసు. ఓట్ల ద్వారానే వారు ఆయనకు గట్టి సమాధానం చెప్తారు. 2004లో నేను ముంబై నుంచి పోటీ చేసినప్పుడు ఆయన నా తరపున ఆయన ప్రచారం చేశారు. అప్పుడు ఆయనకు నేనెవరో తెలీదా? ఇప్పుడు నన్ను ‘అమ్రపాలి (నృత్యకారిణి), నాచ్‌ నే వాలీ’అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు’అని అన్నారు.

మరిన్ని వార్తలు