తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం

19 Nov, 2018 15:17 IST|Sakshi
సిరిసిలల్లో నామినేషన్‌ వేస్తున్న కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లను దాఖలు చేయడానికి గడువు ముగిసింది. దాదాపు 2500 వరకు నామినేషన్లు దాఖలైనట్టు అంచనా. చివరిరోజు కావడంతో సోమవారం నామినేషన్లు పోటెత్తాయి. అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో పాటు స్వతంత్రులు, తిరుగుబాటు అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈనెల 22 వరకు గడువు ఉంది. డిసెంబర్‌ 7న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 11న ఓట్లను లెక్కిస్తారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు ఈరోజు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి కూడా నామినేషన్లు దాఖలు చేశారు.

నిజామాబాద్ జిల్లా
నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి నామినేషన్
నిజామాబాద్ రూరల్ బీజేపీ అభ్యర్థి గడ్డం ఆనంద్ రెడ్డి నామినేషన్
నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తహెర్బిన్ హాన్ దన్ నామినేషన్
ఆర్మూర్ లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ అభ్యర్థిగా వెంకటేష్ నామినేషన్
బోధన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది సుదర్శన్ రెడ్డి నామినేషన్
బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరవత్రి అనిల్ నామినేషన్
బాల్కొండ బీజేపీ అభ్యర్థిగా రాజేశ్వర్ నామినేషన్
బాల్కొండ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా రయ్యాడి రాజేశ్వర్ నామినేషన్

కరీంనగర్ జిల్లా
జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు 102 మంది నామినేషన్లు దాఖలు
కరీంనగర్ లో 25 మంది 43 నామినేషన్లు దాఖలు
చొప్పదండిలో 17 మంది 33 నామినేషన్లు దాఖలు
మానకొండూరులో 16 మంది 43 నామినేషన్లు దాఖలు
హుజురాబాద్ లో 27 మంది 52 నామినేషన్లు దాఖలు
హుజురాబాద్‌లో 17 మంది నామినేషన్ల దాఖలు
టిఆర్ఎస్ అభ్యర్థిగా ఈటెల రాజేందర్
స్వతంత్ర అభ్యర్థిగా ఈటెల రాజేందర్ సతీమణి ఈటల జమున
కాంగ్రెస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి
జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా పల్లె ప్రశాంత్
బీఎస్పీ అభ్యర్థిగా మారపెల్లి మొగిలి
అఖిల భారత జన సంఘ్‌ అభ్యర్థిగా కురెళ్ళ శ్రావణ్ కుమార్
ఇండిపెండెంట్‌ గా మేకల మల్లేష్ యాదవ్ (ఈటల రాజేందర్ మాజీ కార్ డ్రైవర్) నామినేషన్లు వేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా
జిల్లా లోని 2 అసెంబ్లీ స్థానాలకు 37 మంది 76 నామినేషన్లు దాఖలు
సిరిసిల్లలో 14 మంది 26 నామినేషన్లు దాఖలు
వేములవాడ లో 23 మంది 50 నామినేషన్లు దాఖలు
సిరిసిల్ల టిఆర్ఎస్ అభ్యర్థిగా కేటిఆర్, కాంగ్రెస్ అభ్యర్థిగా కెకె మహేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మల్లుగారి నర్సాగౌడ్ నామినేషన్ వేశారు.

జగిత్యాల జిల్లా
జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు 43 మంది 90 నామినేషన్లు దాఖలు
జగిత్యాలలో 14 మంది 20 నామినేషన్లు దాఖలు
కోరుట్లలో 17 మంది 30 9 నామినేషన్లు దాఖలు
ధర్మపురిలో 12 మంది 31 నామినేషన్లు దాఖలు

ధర్మపురి నియోజకవర్గానికి..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నామినేషన్‌
టిఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ నామినేషన్‌
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా మద్దెల రవీందర్ (కాంగ్రెస్ రెబల్) నామినేషన్‌
బీజేపీ అభ్యర్థిగా కన్నం అంజయ్య నామినేషన్‌
బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా తడిగొండ నాగరాజు నామినేషన్‌
న్యూ ఇండియా పార్టీ అభ్యర్థిగా మోతె నరేష్ నామినేషన్‌
నయా భారత్ పార్టీ అభ్యర్థిగా దూడ మహిపాల్ నామినేషన్‌
జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా సత్పాడి ప్రణయ్ కుమార్ నామినేషన్‌
స్వతంత్ర అభ్యర్థినిగా బురదకుంట సంఘ మిత్ర నామినేషన్‌
స్వతంత్ర అభ్యర్థులుగా కుంటాల నర్సయ్య, రామగిరి సంతోష్ నామినేషన్‌

పెద్దపల్లి జిల్లా
జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు 68 మంది 120 నామినేషన్లు దాఖలు
పెద్దపల్లి లో 25 మంది 46 నామినేషన్లు దాఖలు
మంథనిలో 20 మంది 35 నామినేషన్లు దాఖలు
రామగుండంలో 23 మంది 39 నామినేషన్లు దాఖలు

పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు నామినేషన్
పెద్దపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి నామినేషన్
పెద్దపల్లి లో నేడు 14 మంది నామినేషన్లు దాఖలు చేశారు
రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థి సోమరపు సత్యనారాయణ తరపున ఆయన కొడుకు నామినేషన్
జై మహాభారత్ పార్టీ తిరునగరి దుర్గ భవాని అభ్యర్థి నామినేషన్
స్వతంత్ర అభ్యర్థిగా వెంకటేశం నామినేషన్
మంథనిలో ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 16 మంది, 27 నామినేషన్ల దాఖలు

సంగారెడ్డి జిల్లా
నారాయణఖేడ్ బీజేపీ తరపున డాక్టర్‌ పి. సంజీవరెడ్డి నామినేషన్
నారాయణఖేడ్ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎం భూపాల్ రెడ్డి నామినేషన్

మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య నామినేషన్‌
మంచిర్యాలలో కాంగ్రెస్ అభ్యర్ధి ప్రేమసాగర్ రావు, బీజేపీ అభ్యర్థి రఘునాథ రావు, టిఆర్ఎస్ అభ్యర్థి దివాకర్‌రావు, శివసేన అభ్యర్థి కూకట్ల తిరుపతి యాదవ్ నామినేషన్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మొత్తం ఐదు నియోజకవర్గాల్లో వచ్చిన నామినేషన్లు 121
కొత్తగూడెం: 26
భద్రాచలం : 19
అశ్వారావుపేట: 29
ఇల్లందు: 27
పినపాక: 20

మరిన్ని వార్తలు