జార్ఖండ్‌లో కొనసాగుతున్న తొలిదశ పోలింగ్‌ 

30 Nov, 2019 08:34 IST|Sakshi

సాక్షి, రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు తొలిదశ పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం ఆరు జిల్లాల్లోని13 అసెంబ్లీ స్థానాలలో సుమారు 37 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. శనివారం ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ బూత్‌ల వద్ద బారులు తీరారు. కాగా  బీజేపీ12 స్థానాల్లో పోటీ చేస్తూండగా, హుస్సేయినాబాద్‌ స్థానంలో కాషాయ పార్టీ స్వతంత్ర అభ్యర్థి వినోద్‌ సింగ్‌కు మద్దతిస్తోంది. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు మొదలు కాగా, మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. కాగా జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ కట్టబెట్టిన చరిత్ర జార్ఖండ్‌ ప్రజలకు లేదు. 2014 ఎన్నికల్లో కలిసిపోటీ చేసిన బీజేపీ, ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏజేఎస్‌యూ) కూటమికి 41 సీట్లతో సింపుల్‌ మెజార్టీ వచ్చింది. దీంతో అయిదేళ్లలోనే స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైంది.

  • మొత్తం అసెంబ్లీ స్థానాలు : 81
  • అయిదు దశల్లో ఎన్నికలు
  • నవంబర్‌ 30, డిసెంబర్‌ 7,
  • డిసెంబర్‌ 12, డిసెంబర్‌ 16,
  • డిసెంబర్‌ 20న ఎన్నికలు
  • ఫలితాలు వెల్లడి : డిసెంబర్‌ 23 
మరిన్ని వార్తలు