సుప్రీంను ఆశ్రయించిన ఐదుగురు ఎమ్మెల్యేలు

13 Jul, 2019 14:51 IST|Sakshi

స్పీకర్‌ తమ రాజీనామాలు ఆమోదించేలా చూడాలని అభ్యర్థన

సాక్షి, బెంగళూరు: కర్ణాటక  స్పీకర్‌కి వ్యతిరేకంగా మరో ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆనంద్‌ సింగ్‌, రోషన్‌ బేగ్ సహా ఐదుగురు ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తమ రాజీనామాలు ఆమోదంలో  స్పీకర్‌ జాప్యం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే 10 మంది రెబల్ కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం మంగళవారం వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అప్పటివరకూ రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌లో తమను ఇంప్లీడ్‌ చేసి విచారణ జరపాలని మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ధర్మాసనాన్ని కోరారు. తమ రాజీనామాలు స్పీకర్‌ ఆమోదించేలా చూడాలని అభ్యర్థించారు. దీంతో స్పీకర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేల సంఖ్య 15కు చేరింది. 

మరిన్ని వార్తలు