పాక్‌ రాజకీయాల్లో మరో సంచలనం!

26 Apr, 2018 15:40 IST|Sakshi
పాక్‌ విదేశాంగమంత్రి ఖవాజా ఆసిఫ్‌

విదేశాంగ మంత్రిపై వేటు

ఇస్లామాబాద్‌: అస్థిరతకు మారుపేరుగా ఉండే పాకిస్థాన్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్‌ ప్రభుత్వంలోని కీలక పాత్ర పోషిస్తున్న విదేశాంగమంత్రి ఖవాజా ఆసిఫ్‌ను ఇస్లామాబాద్‌ హైకోర్టు అనర్హుడిగా తేల్చింది. ఖవాజాకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో వర్క్‌ పర్మిట్‌ ఉన్న కారణంగా పార్లమెంటు సభ్యుడిగా ఉండటానికి అనర్హుడని హైకోర్టు తేల్చింది. దీంతో ఆయన కేంద్రమంత్రి పదవి నుంచి, ఎంపీ పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పాక్‌ ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రి అయిన ఖవాజా విదేశాంగ బాధ్యతలను చూస్తున్నారు. కోర్టు ఆయనను అనర్హుడిగా తేల్చడం పాక్‌ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే అవినీతి ఆరోపణల వల్ల పాక్‌ ప్రధాని పదవి నుంచి నవాజ్‌ షరీఫ్‌ తప్పుకున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (పీఎంఎల్‌) పార్టీ షాహిద్‌ ఖకాన్‌ అబ్బాసీని ప్రధానిగా నియమించింది. ఈ నేపథ్యంలో తాజా కోర్టు ఉత్తర్వులు పీఎంఎల్‌కు మరో షాక్‌ నిచ్చాయని పాక్‌ మీడియా పేర్కొంటున్నది.

మరిన్ని వార్తలు