బాబు సినిమాల్లో మాంత్రికుడిలాంటి నాయకుడు

31 May, 2020 11:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : కరోనా సమయంలో రాష్ట్రంలో ఉండకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు పారిపోయారని మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్‌ విమర్శించారు. విశాఖ వస్తానని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సినిమాల్లో మాంత్రికుడు లాంటి నాయకుడని.. జూమ్‌ మంతర్‌ అంటూ నలుగురు నాయకులతో మీటింగ్‌లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. దివంగత సీఎం ఎన్టీఆర్‌.. బీసీల కోసం పార్టీ పెడితే, చంద్రబాబు వారికే అన్యాయం చేశారని మండిపడ్డారు. (చదవండి : అచ్చెన్నాయుడుకు కృపారాణి సవాల్)

అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు వారి జపం చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఎన్ని చేసిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. తన పాలనలో చంద్రబాబు ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సహకాలు ఎగవేస్తే.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కష్టకాలంలో కూడా వాటిని చెల్లించారని గుర్తుచేశారు. టీడీపీ పాలనలో ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను కూడా సీఎం వైఎస్‌ జగన్‌ విద్యాసంస్థలకు అందించారని తెలిపారు. బీసీ నాయకులు ఎదిగిన దశలో ఉత్తరాంధ్రలో ఎర్రన్నాయుడు, తెలంగాణలో దేవేందర్‌ గౌడ్‌లపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారని తెలిపారు. దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్రంలో బీసీలకు మంత్రి పదవి ఇస్తామన్నా.. చంద్రబాబు వద్దని వారి అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు