కవిత రాజకీయ భవిష్యత్తు ఏమిటి?

31 Oct, 2019 12:56 IST|Sakshi

 ఓటమి అనంతరం ఇందూరుకు దూరంగా కవిత

స్థానిక సంస్థల ఎ‍న్నికల ప్రచారానికీ దూరమే

కవితకు రాజ్యసభ ఇస్తారని పార్టీలో ప్రచారం!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత గత సార్వత్రిక ఎన్నికల్లో ఓ‍టమి అనంతరం పూర్తిగా సైలెంట్‌ అయిపోయారు. రాజకీయంగా ఎంతో ఉత్సాహంగా ఉండే కవిత ఓటమి అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తొలిసారి లోక్‌సభకు పంపిన నిజామాబాద్‌లో రెండోసారి కలిసి రాకపోవడంతో ఇక అటుదిక్కు చూడటం చూడా మానేశారు. ఈ నేపథ్యంలో ఆమె దారెటు? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. అంతేకాదు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలనూ పలు ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఎంపీగా ఓడిపోయిన తర్వాత కవిత ఎందుకు సైలెంట్‌ అయిపోయారు.? పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయని కవిత. మున్సిపల్ ఎన్నికల్లో అయినా ప్రచారం చేస్తారా? కవితకు కేసీఆర్‌ ఏ పదవి ఇస్తారు.? అసలు కవిత రాజకీయ భవిష్యత్తు ఏమిటి.? అనే అంశాలపై తీవ్ర చ​ర్చ జరుగుతోంది.

నిజామాబాద్ టీఆర్ఎస్‌లో స్తబ్దత ఆవహించింది. లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓటమితో నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. కేసీఆర్ కూతురు కవిత ఓటమి చెందడం ఆమె భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసింది. తరుచూ  పర్యటనలు, కార్యక్రమాలతో సందడి చేసే కవిత ఈ మధ్య  జిల్లా వైపు రావడం తగ్గించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఫలితాలు రాకముందే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా. తన అత్తగారి పొతంగల్ గ్రామానికి ఓసారి, టీఆర్ఎస్ కార్యకర్త చనిపోయిన సందర్భంగా మోపాల్కి మరోసారి, ఇటీవల ఇందూరు యూత్ వార్షికోత్సవం సందర్భంగా నగరానికి ఇంకోసారి ఇలా మూడు సార్లు మాత్రమే కవిత జిల్లాకు వచ్చారు. గ్రామ పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూడా ప్రచారానికి ఆమె రాలేదు. ఓటు మాత్రం వేసి వెళ్లారు. ఓటమి చెందినా ప్రజల్లోనే ఉంటానని కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని మోపాల్ లో వ్యాఖ్యానించారు. కానీ స్థానికంగా పర్యటించకపోవడం, ప్రజల్లోకి వెళ్లలేకపోవడం కార్యకర్తల్లో పార్టీలో నైరాశ్యం నింపుతోందని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. ఇటు ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాలకే పరిమితం కావడం వల్ల కూడా పార్లమెంటు నియోజకవర్గానికి పెద్ద దిక్కు లేకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది.

కవితకు మైనస్సే..
మరి కవిత దారెటు.? ఆమె రాజకీయ ప్లాన్ ఏంటి.? కేసీఆర్ ఏం బాధ్యతలు అప్పగించబోతున్నారనే అంశాలు నిజామాబాద్ జిల్లాలో కొంత కాలంగా హాట్ టాపిక్ అయ్యాయి. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారా.? అదే జరిగితే మళ్లీ ఎలా మొదలుపెట్టాలి.? ఎక్కడ స్టార్ట్ చేయాలి. అనే ప్రశ్నలు కవితను, సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ పెద్దలను తొలుస్తున్నాయా..? అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. పార్టీ అధిష్ఠానం కానీ కేడర్ కానీ ఎవరూ కవిత విషయంలో నోరు మెదపడం లేదు. సీఎం కూతురు కావడంతో పాటు ఆమెది అధిష్ఠానం స్థాయి కాబట్టి ఎవరూ ఏమీ మాట్లాడలేక పోతున్నారు. వాస్తవానికి తిరిగి ఏదైనా పెద్ద పదవిలోకి రావడం ఆమెకు కష్టమేమీ కాదు. కానీ ఏం జరిగినా కేసీఆర్‌ నిర్ణయం, కవిత అభీష్టం పైనే ఆధారపడి వుంటాయన్నది జగమెరిగిన సత్యం. అయితే ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం కవితకు మైనస్సే అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అయినా నిజామాబాద్ జిల్లాకు వస్తారా.? ప్రచారం చేస్తారా.? అనేది చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో మంత్రి ఎమ్మెల్యలే మున్సిపల్ ఎన్నికలకు వెళ్తారా.? లేక సీఎం కేసీఆర్ కవితకు ఆదేశాలిస్తారా అనే చర్చ కేడర్ లో జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో కల్వకుంట్ల కవితకు రాజ్యసభ పదవి కట్టబెట్టి పెద్దల సభకు పంపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన భూపతిరెడ్డి ఎమ్మెల్సీ పదవి దాదాపుగా ఖాళీ అయినట్లే. కవితకు ఎంఎల్‌సి ఇస్తారా.? ఎంపీగా చేసిన ఎంఎల్‌సీ పదవిని తీసుకుంటారా? అసలు కవిత విషయంలో కేసీఆర్ ఆలోచన ఏంటి.? కవిత ఇంట్రెస్ట్ ఏమిటి.?  తండ్రీ కూతుర్లిద్దరూ  సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారా.? త్వరలో  ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వస్తాయోమో చూడాలి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొత్త చరిత్రకు నేడే శ్రీకారం: మోదీ

ఏపీ సీఎం జగన్‌ సక్సెస్‌ అయ్యారు: కేశినేని నాని

సీపీఐ నేత గురుదాస్‌ గుప్తా ‍కన్నుమూత

ఉక్కుమనిషికి ఘన నివాళి..

మీ‘బండ’బడ.. ఇదేం రాజకీయం! 

చంద్రబాబు రాజకీయ దళారీ

పగ్గాలు ఎవరికో?

కేంద్ర ప్రభుత్వంలో చేరుతాం: జేడీయూ

తేరే మేరే బీచ్‌ మే

ఉత్తమ్‌కు కేసీఆర్‌ దెబ్బ రుచి చూపించాం

అవసరమైతే మిలియన్‌ మార్చ్‌!

‘పవన్‌ కల్యాణ్‌తో వేదిక పంచుకోం’

ఆర్టీసీ సమ్మె : ‘వారు జీతాలు పెంచాలని కోరడం లేదు’

ఆర్టీసీ సమ్మె : ‘మేనిఫెస్టోలో కేసీఆర్‌ ఆ విషయం చెప్పారా’

ధ్యానం కోసం విదేశాలకు పోయిండు!!

కశ్మీర్‌లో.. మహాపాపం చేశారు!!

నో సీఎం పోస్ట్‌: 13 మంత్రి పదవులే ఇస్తాం!

తెలుగుదేశం పార్టీలో ఎవరూ మిగలరు...

చంద్రబాబు రాజకీయ దళారి...

‘కామెడీ స్కిట్‌లా లోకేష్‌ ఐదు గంటల దీక్ష’

‘కశ్మీర్‌ మన అంతర్గత విషయం కాదా?’

కేశినేని నానిని టీడీపీ నుంచి బహిష్కరించాలి..

‘మహా’ రాజకీయం: వ్యంగ్య కార్టూన్‌!

కాంగ్రెస్‌కు పీసీసీ చీఫ్‌ల షాక్‌లు

బీజేపీ మదిలో గత కాలపు జ్ఞాపకాలు

ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం..

కుమార కాషాయ రాగం

టీడీపీది ముగిసిన చరిత్ర

అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా

బిగ్‌బాస్‌: వాళ్లకు సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలీదు!

‘ఆయనను మహారాష్ట్ర సీఎం చేయండి’

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి

ప్రిన్స్‌ ఇంట ‘బాయిదూజ్‌’ సంబరం

ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : న‌రేష్‌