మార్ఫింగ్‌ కానేకాదు.. నిజం

22 Jun, 2018 10:08 IST|Sakshi
యోగాసనాలు వేస్తున్న దెవె గౌడ

ఒక్క ఫోటో.. ఒకే ఒక్క ఫోటో... నిన్న ఇంటర్నేషనల్‌ యోగా డే సందర్భంగా ఇంటర్నెట్‌ను షేక్‌ చేసి పడేసింది. మాజీ ప్రధాని దేవె గౌడ తన ఇంట్లో బెడ్‌పై యోగా చేస్తున్న ఫోటో ఒక్కటి విపరీతంగా చక్కర్లు కొట్టింది. జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆ ఫోటోను ట్వీట్‌ చేయగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ‘అది మార్ఫింగ్‌ కాదు కదా?’ అని ప్రశ్నించటం, నేతలతోపాటు పలువురు సెలబ్రిటీలు, మరికొందరు ఆ ఫోటోను సరదాగా రీట్వీట్‌ చేయటం... నిన్నంతా ఈ ఫోటోనే హల్‌ చల్‌ చేసింది. 

అయితే కాసేపటికే ఆయన బెడ్‌ రూమ్‌లో యోగా చేస్తున్న ఫోటోలు మొత్తం బయటికి వచ్చేశాయి. ‘తాను ప్రతీరోజు ఆసనాలు వేస్తానని.. యోగా డే సందర్భంగా కాస్త ఎక్కువ సేపే చేశానని’  ఈ సందర్భంగా దెవె గౌడ స్థానిక మీడియాతో కూడా చెప్పారు. ఇంతకు ముందు ప్రధాని మోదీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు కర్ణాటక సీఎం కుమారస్వామి రియాక్ట్‌ కాకపోయినా.. 86 ఏళ్ల ఈ మాజీ పీఎం మాత్రం స్పందించినట్లు కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు బెడ్‌రూమ్‌లో ఆసనాలతో ఆయన చేసిన ఫోటోషూట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఇక ట్రోలింగ్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకోండి.

మరిన్ని వార్తలు