ప్రకాశం జిల్లా టీడీపీలో గందరగోళం    

14 Mar, 2019 19:21 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రకాశం జిల్లా టీడీపీలో గందరగోళం నెలకొంది. జిల్లాలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేయడంతో అధికార టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో టీడీపీ అధిష్టానం అయోమయంలో పడింది. ఒక వైపు నామినేషన్ల గడువు సమీపిస్తుండం.. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై స్పష్టత లేకపోవడంతో జిల్లా టీడీపీ కార్యకర్తలు కూడా గందరగోళానికి గురవుతున్నారు.

దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు ఒంగోలు అభ్యర్థి కోసం గాలింపు మొదలుపెట్టారు. మంత్రి శిద్దా రాఘవరావును ఒంగోలు బరిలోకి దించేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే శిద్దా మాత్రం ఎంపీగా పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. దర్శి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని, ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయలేనని చంద్రబాబుకు విన్నవించినట్లు తెలుస్తోంది.

మరో వైపు తమ నేతకు దర్శి టికెట్‌ ఇవ్వాలని శిద్దా రాఘవరావు వర్గం కార్యకర‍్తలు నిరసనకు దిగారు. దీంతో ఎవరిని ఒంగోలు నుంచి బరిలోకి దింపాలో తెలియక చంద్రబాబు అయోమయానికి గురవుతన్నారు. దర్శి, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆ స్థానాల నుంచి ఎవరిని పోటీలో నిలబెడుతున్నారు ఇంకా స్పష్టత రాలేదు. ఎంపీ అభ్యర్థిపై స్పష్టత వచ్చాకే దర్శి, కనిగిరి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

చదవండి : బాబ్బాబు.. పోటీ చేయండి

మరిన్ని వార్తలు