ఇంద్రభవనంలో విశ్రమించి ఇప్పుడొచ్చారు

26 May, 2020 05:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోట్లాది రూపాయలతో హైదరాబాద్‌లో నిర్మించుకున్న ఇంద్రభవనంలో రెండు నెలలకుపైగా విశ్రాంతి తీసుకొని చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో అడుగు పెట్టారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీకి రాగానే పూలు జల్లించుకున్న చంద్రబాబు, భౌతిక దూరం పాటించలేదని, టీడీపీ నేతలు మాస్క్‌లు కూడా ధరించలేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు మీద ఎన్నికేసులు పెట్టాలని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఏడాది పాలన బ్రహ్మాండంగా ఉందంటూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే సీఎం వైఎస్‌ జగన్‌ ఏడాది పాలనపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు.  

ఆయన ఇంకా ఏమన్నారంటే.. 
► ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న చర్యలు, ప్రభుత్వం వేగంగా స్పందించిన తీరు, సహాయక కార్యక్రమాలను దేశం మొత్తం ప్రశంసించింది. 
► హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లారు. ఇప్పుడు వైజాగ్‌ వెళ్లి ఏం చేస్తారు. ఆయన హైదరాబాద్‌ నుంచి నేరుగా విశాఖ వెళ్లవచ్చుకదా? కరకట్ట ఇంటికి ఎందుకు వచ్చారు. తాను విశాఖ వెళ్తుంటే ఎయిర్‌పోర్టులు మూసివేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. 
► ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన జయంతి వేడుకలు ఎలా నిర్వహిస్తారు.  
► అందరికీ లబ్ధి చేకూరేలా సీఎం వైఎస్‌ జగన్‌ పాలన సాగుతోంది. జగన్‌కు మంచిపేరు వస్తుందనే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. 

మరిన్ని వార్తలు